వైసీపీలో చేరుతున్న సినీ నటుడు అలీ.. ముహూర్తం ఖరారు

  • జనవరి 9న ఇచ్చాపురంలో ముగుస్తున్న జగన్ పాదయాత్ర
  • ఆరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న అలీ
  • ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం
ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ వైసీపీలో చేరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జనవరి 9న జగన్ పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ సభలో అలీ వైసీపీలో చేరుతారు.

డిసెంబర్ 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో జగన్ ను అలీ కలిశారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరాలనే ఆకాంక్షను జగన్ వద్ద వ్యక్తపరిచారు. అలీ రాజమండ్రికి చెందిన వ్యక్తి కావడంతో... ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. అలీ సినీ గ్లామర్ పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. మరోవైపు, పార్టీ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అలీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. 
Go Back to Shorts
YSRCP
jagan
ali
tollywood
join

More Telugu News